Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.03.2024
Share:

By Village Missionary Movement

Friday, 15-Mar-2024

దిన ధ్యానము(Telugu) 15.03.2024

 

అంశం: బైబిల్ సత్యమైనది 

 

"నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను" – కీర్తనలు 119:97

 

బైబిల్ ఆంగ్ల భాషలో ట్రాన్స్లేట్ చేయబడిన కాలంలో బైబిల్ చదవాలని ఆసక్తి కలిగి ఉండేవారు ఇంగ్లాండ్ దేశానికి చెందిన విలియం టెండెల్. రోమన్ క్యాథలిక్ చట్ట ప్రకారము బోధకులు చేతుల్లో మాత్రమే బైబిల్ ఉండాలి మరియు పాప క్షమాపణ టికెట్టు, విగ్రహారాధన, బోధకుల యొక్క ఆడంబరమైన జీవితం వంటి బైబిల్ కి వ్యతిరేకమైన కార్యాలు విస్తారంగా ఉండేవి. సాధారణ ప్రజలకు కూడా బైబిల్ ని చదవాలి అనే కోరికలో కొత్త నిబంధనను ఆంగ్లంలో తర్జుమా చేశారు విలియం టెండెల్ . 1524వ సంవత్సరంలో మార్టిన్ లూథర్ ని దర్శించి అక్కడ తర్జమాను ప్రారంభించారు. భాష రాణి ఆయన ఒకే సంవత్సరంలో చాలా కఠిన ప్రయాసము చేత భాషను నేర్చుకున్నారు. 1525వ సంవత్సరంలో జర్మనీలో తాను తర్జుమా చేసిన ఇంగ్లీష్ బైబిల్ ని విడుదల చేశారు. 1526వ సంవత్సరంలో బైబిల్ ముద్రించి ఇంగ్లాండ్ దేశంలోనికి తీసుకొని వచ్చారు. దానిని తెలుసుకున్న ఇంగ్లాండు ప్రభుత్వము ఇది క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనది అని వాటన్నిటిని కూడా అగ్నిలో పెట్టి కాల్చివేసింది. 

 

1528వ సంవత్సరంలో టీండేల్ ప్రభుత్వానికి వ్యతిరేకమైన వ్యక్తి అని ప్రకటించబడ్డారు. 1530వ సంవత్సరంలో 8వ రాజు అయినా హేన్డ్రి ఖైదీగా చెరసాలలో పెట్టుటకు ప్రయత్నించారు. ఐదు సంవత్సరాలు దాక్కొని ఉన్న విలియం టెండెల్ తన స్నేహితుని అప్పగించబడి అక్టోబర్ నెలలో 6వ తారీఖున గొంతు పిసికి చెట్టుకు కట్టి సజీవ దహనము చేయబడ్డాడు. అప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఇంగ్లాండు రాజు యొక్క మనో నేత్రములు తెరవండి అనే ప్రార్థన చేశాడు. ఆయన మరణించిన మూడు సంవత్సరము తర్వాత ఇంగ్లాండ్ రాజైన ఎనిమిదవ హిన్డ్రి చేతనే ఆ బైబిల్ ముద్రించి బడి వినియోగించబడింది. బైబిల్ కొరకు విలియం టెండెల్ వంటి వారు ఎంతోమంది ప్రాణాలు ఇచ్చి ఉన్నారు అనే దానిని మనము గ్రహించాలి. 

 

నా ప్రియమైన వారలారా! మన చేతుల్లో గల బైబిల్ కు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం? రోజు బైబిల్ చదివి ధ్యానించి దానిని శ్వాసగా అనుభవించి దానిని రుచి చూస్తున్నామా? అలాంటి బైబిల్ ప్రకారమైన జీవితాన్ని జీవిస్తున్నామా? బైబిల్ ని మన అనుదిన జీవితంలో చదువుతూ దాన్ని అభ్యసించి మన చుట్టూ ఉన్న అందరికీ ఆ వాక్యాన్ని విత్తె వారిగా ఉన్నామా? ఇర్మియా వలె మీ మాటలు నాకు దొరికిన వెంటనే వాటిని నేను భుజించాను అది నాకు సంతోషాన్ని, నా హృదయానికి ఆనందాన్ని కలిగించింది అనే సాక్ష్యము చెప్పి వాక్యానుసారముగా జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమెన్! 

- శ్రీమతి. సరోజా మోహన్ దాస్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్ లో జరుగుతున్న ట్యూషన్ సెంటర్ ద్వారా విద్యార్థులు మరియు వారి టీచర్స్ అందరూ కూడా యేసు ప్రేమను తెలుసుకునేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet instagram unban service tiktok unban instagram unban x unban twitter unban palacebet