Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.03.2024
Share:

By Village Missionary Movement

Monday, 18-Mar-2024

దిన ధ్యానము(Telugu) 18.03.2024

 

అంశం: దేవుని కోసం ఎంచబడుతున్న విధము

 

"జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు" - 1 కోరింథీయులకు 1:28

 

ఈరోజు మనం జీవిస్తున్న కాలంలో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కాలములో చాలా తక్కువ మంది దేవుడు ఎంచుకొని వాడుతూ వచ్చారు. చిన్న చూపు చూపబడిన లేయ ద్వారా దేవుని యొక్క పరిచర్య చేయుటకు ఒక సంతతి వచ్చింది. చాలా సంవత్సరాలుగా పిల్లలు లేకుండా నిందలను అనుభవిస్తూ వచ్చిన హన్న ద్వారా ఒక ప్రవక్త మరియు న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు పుట్టాడు. రాహాబు రూతు యొక్క మార్గంలోని యేసుప్రభు పుట్టారు. కొత్త నిబంధన కాలంలో సమరయ స్త్రీ వీళ్ళందరూ చిన్న చూపు చూడబడినటువంటి వ్యక్తులే. 

 

యోసేపు, దావీదు వీరు సహోదరులు చేత చిన్నచూపు చూపబడిన వ్యక్తులే. అపోస్తులుడైన పౌలు శరీరంలో బలహీనతతో కనిపించారు. విలియం కేరి చెప్పులు కుట్టే వ్యక్తి. డిఎల్ మోడీ చాలా తక్కువ చదువు చదివిన వ్యక్తి. మిగిలిన వారంరూ ఇతనిని చాలా తక్కువగా చూసారు. ఆయనను దేవుడు ఉజ్జీవము తీసుకురావడానికి అతనిని ఒక వ్యక్తిగా వాడుకుని వచ్చారు. వికలాంగురాలుగా ఉన్న సారా టక్కరి యొక్క త్యాగమును మరియు చేసిన పనిని మనం మర్చిపోలేము. 

 

మన కాలంలో జీవించిన పాస్టర్ మోజెస్ రాజశేఖర్ శరీరంలో చాలా వ్యాధులతో ఉన్నప్పుడు దేవుడు అతనిని చాలా గట్టిగా వాడుకున్నారు. ఈరోజు మన మధ్యలో సేవ చేస్తూ వస్తున్న చాలా మంది ప్రజలకు శరీరంలో చాలా రకమైనటువంటి వ్యాధులతో ఉన్నారు. దేవుడు వారిని వాడుకుంటున్నారు. 

 

నిక్ అనే ఒక వ్యక్తి పుట్టినప్పటినుంచి రెండు కాళ్లు రెండు చేతులు లేకుండా పుట్టాడు తన యొక్క 13వ సంవత్సరంలో వికలాంగుడైన ఒకరి గురించి చదివాడు నిక్ ఆ వికలాంగుడు తన మెడతో గల్ఫ్ ఆడుతున్నదని చూసి నిక్ యొక్క హృదయంలో ఒక నమ్మకం వచ్చింది. 

 

యేసు ప్రభువుని అంగీకరించ లేని నిక్ తర్వాత యేసుప్రభుని మిగతా వాళ్లకు చెప్పాలి అని ఒక ముగింపుకు వచ్చాడు. అతని యొక్క నమ్మకమైన మాటలు చాలామందిని యేసుప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాయి. ఇతను 64 దేశాలకు పైగా వెళ్తూ లక్షలాది కొలది ప్రజలను యేసు ప్రభువు వైపు తిప్పుటకు కారణమయ్యాడు. ఇతనికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. లోక జీవితంలో చాలా మంది వికలాంగులైన వారికి ఒక నమ్మకమైన చిత్రంగా జీవిస్తూ వస్తున్నారు. 

 

దీనిని చదువుతున్న దేవుని పిల్లలారా! మీకు బలహీనత ఉన్నప్పుడు నా వలన ఇది చేయడానికి అవ్వదు అని బాధపడుతున్నారా? నా వలన ఏమి చేయడానికి నావల్ల కాదు అని అనుకుంటున్నారా? యేసుప్రభు దగ్గర ప్రభువా మీ చిత్తాను సారముగా నన్ను నడిపించు, మీ చిత్తమే నా జీవితంలో జరగాలి అని మిమ్మల్ని మీరు దేవుని దగ్గర అర్పించుకున్నప్పుడు అతను మిమ్మల్ని ఒక ఉజ్జీవము లో వాడుకుంటారు అనే దాంట్లో సందేహం లేదు. 

- శ్రీమతి. ఫాతిమా సెల్వ రాజు గారు 

 

ప్రార్థన అంశం:

మే నెలలో జరగబోతున్న వి.బి.ఎస్ ద్వారా 3000 గ్రామములలో ఉన్న చిన్నపిల్లలకు యేసుప్రభు గురించి చెప్పగలుగు లాగున ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet güncel holiganbet giriş holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking casibom giriş perabet padişahbet padişahbet giriş holiganbet matbet perabet perabet giriş instagram ban service pashagaming pashagaming giris gorabet gorabet giris grandpashabet çarkbet çarkbet giriş deneme bonusu casibom giriş casibom vaycasino vaycasino giriş casibom meritking casibom casibom giriş meritking meritking giriş holiganbet jojobet jojobet jojobet jojobet jojobet holiganbet holiganbet grandpashabet grandpashabet grandpashabet