Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.03.2024
Share:

By Village Missionary Movement

Monday, 25-Mar-2024

దిన ధ్యానము(Telugu) 25.03.2024

 

అంశం: త్యాగాన్ని గుర్తుపెట్టుకుందాం 

 

"అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను" - రోమీయులకు 5:8

 

ఒకసారి పెన్సిల్వేనియా అనే ప్రాంతంలో సుడిగాలి కొట్టింది. డేవిడ్ కోస్టివా అనే మనుష్యుడు ఒక విశాలమైన స్థలంలో ఆటలాడుతూ ఉన్నారు. అతని పక్కనే తన సహోదరి యొక్క కుమార్తె నిలబడి చూస్తూ ఉన్నది. సుడిగాలని గమనించిన డేవిడ్ కోస్టివా వెంటనే ఆ చిన్నదాన్ని ఎత్తుకొని ఒక గోతీలో ఆమెను పెట్టి ఆ గొయ్యి పైన ఆయన పడుకున్నాడు. హఠాత్తుగా సుడిగాలి అతనిని ఎత్తుకొని పోయింది. కానీ ఆ చిన్నది మాత్రం కాపాడబడింది. తన సహోదరి యొక్క కుమార్తె కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు డేవిడ్ కోస్టివ.

 

అపోస్తులుడైన పౌలు రోమీయులకు ఇలా రాస్తున్నారు. మనం పాపములో ఉన్నప్పుడు క్రీస్తు మన కోసము మరణించి మన పైన ఉంచిన ప్రేమను బయటకు వ్యక్తపరిచారు అని కాబట్టి మనం పాపములో జీవించినప్పుడు అతడు మన మీద ఉంచిన ప్రేమ ద్వారా ఆయన మనల్ని బయటకు తీశారు. దేవుడు తన ఏకైక కుమారుడ్ని సిలువలో మరణించుటకు అప్పగించారు. మన పాపములు నుండి బయటకు రావడానికి ఎటువంటి మార్గం లేదు కాబట్టి నిరంతరం మనం జీవించడానికి ఆయన తన జీవాన్ని మనకు ఇచ్చారు. 

 

దీన్ని చదువుతున్న ప్రియమైన వారలారా! ఆయన మన యొక్క అక్రమాల, పాపముల కొరకు మరణించారని మన హృదయంలో నిజముగా విశ్వసిస్తే ఇంకను పాపములో జీవించలేము. మన ఇష్టానుసారముగా జీవించకుండా పాపం నుండి బయటకు వస్తాం. దేవుడు చేసిన త్యాగమును గుర్తు పెట్టుకుందాం. మన పాపముల కొరకు మారుమనస్సు పొంది దేవునిని క్షమాపణ అడుగుదాం. పైగా మన పాపము నుండి బయటకు మనలను నడిపించిన యేసయ్యకు మనం ఏమి చేయబోతున్నాం? ఉచితముగా దేవుడిచ్చిన పాపక్షమాపణను యొక్క నిశ్చయతను మిగతా వాళ్లకు సువార్తగా ప్రకటిద్దాం. సిలువ త్యాగం యొక్క గుర్తింపు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యాగముగా శిలువలో పెట్టి ఉన్నారు. ఆ త్యాగమునకు బదులుగా మనం ఏం చేయబోతున్నాం? 

 

సిలువ వైపు చూద్దాం 

సిలువ దగ్గరికి వద్దాం 

సిలువనే మోద్దం 

సిలువ ద్వారా వచ్చే విడుదలను ప్రకటిద్దాం 

- బ్రదర్. గుణశీలన్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన మిగతా రాష్ట్రాల్లో గల మిషనరీల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet giriş matbet giriş holiganbet giriş matbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom giriş deneme bonusu casibom vaycasino vaycasino giriş meritking meritking giriş cratosroyalbet realbahis realbahis giriş casibom casibom giriş casibom casibom giriş imajbet imajbet giriş imajbetapp grandpashabet grandpashabet giriş grandpashabet güncel bets10 bets10 giriş bets10 güncel giriş matbet matbet giriş alobet betmartin pashagaming ultrabet lunabet betzula meritking jojobet jojobet jojobet jojobet jojobet grandpashabet grandpashabet grandpashabet holiganbet holiganbet holiganbet