Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.03.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 26-Mar-2024

దిన ధ్యానము(Telugu) 26.03.2024

 

అంశం: ఉద్రేకత చెందకము

 

“ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు” - యెషయా 28:16

 

జెట్ విమానంలో పైలట్, ఒక స్కూల్ విద్యార్థి మరియు ఒక సైంటిస్ట్ ముగ్గురు కలిసి ప్రయాణిస్తూ ఉన్నారు. మార్గ మధ్యలో ఇంజిన్ రిపేర్ వలన విమానము ఆగిపోయింది. ఇంకా కొంత సమయంలో పెద్ద ప్రమాదం జరగబోతుంది అని గ్రహించిన ఆ పైలట్ మిగిలిన ఇద్దరితో మాట్లాడారు. మనము మన విమానంలో రెండు పారాషూట్ మాత్రమే ఉన్నది కానీ ఇక్కడ మనం ముగ్గురు ఉన్నాం అని పైలట్ మాట్లాడుతూ ఉండేటప్పుడే ఆ సైంటిస్ట్ చాలా తొందరగా ఒక పారాషూట్ ని భుజం మీద తగిలించుకొని విమానం నుంచి వెంటనే దూకారు. 

 

దీన్ని ఎంత మాత్రమూ ఎదురుచూడని ఆ పైలెట్ తొందరపడిపోయి ఆ విద్యార్థిని చూచి పరవాలేదు తమ్ముడు ఇంకొక పారాషూట్ ఉంది దాన్ని నీవు తీసుకొని నువ్వు ప్రాణంతో బయటపడు నువ్వు చిన్న వయసుగలవాడు నీకు చాలా జీవితం ఉన్నది అని చెప్పారు. దానిని విన్న విద్యార్థి లేదు సార్ మనం ఇద్దరం కూడా బ్రతికి ప్రాణాలతో బయటపడుతాం అన్నాడు. అది ఎలా అవుతుంది అన్నప్పుడు మన దగ్గర ఇంకా రెండు పారాషూట్ లు ఉన్నాయి అన్నాడు ప్రశాంతంగా. ఆ సైంటిస్ట్ దూకుతున్న తొందరలో పారాషూట్ బదులుగా నా స్కూల్ బ్యాగ్ ని తగిలించుకొని దూకేశారు చూడండి అని చూపించాడు. ఆ రెండు పారాషూట్లు వాడుకొని వాళ్ళిద్దరూ బయటపడ్డారు

 

పైన చదివిన సంఘటన వినటానికి హాస్యాన్ని కలిగించిన మనలో అనేకులు తొందర పడుతున్న వాళ్ళుగా కనబడుతున్నాం. క్రైస్తవ జీవితంలో విశ్వాసము, సహనము మన యొద్ద లేని ఎడల మన ప్రయాణం కూడా ఆటంకం అయిపోతుంది .ఈ దినం లేఖన భాగం చదువుతున్నప్పుడు తమ పడవలో యేసు ఉన్నప్పటికీ శిష్యులు అయ్యో మేము మరణించ బోతున్నామే అని కేక వేస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క నిరీక్షణ లేని పరిస్థితిని యేసు గర్ధించిన దానిని చదువుతున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులుగా ఉండుట అసాధ్యము అని అవిశ్వాసము గల శిష్యులను చూసి గద్దించి మాట్లాడుతున్నారు (హెబ్రీయులకు రాసిన పత్రిక 11: 6, 3:12) ఇలా మాట్లాడుతూ బైబిల్ మనకి బుద్ధి చెబుతుంది కాబట్టి దీనిని చదువుతున్న ప్రతి ఒక్కరూ విశ్వాసంలో స్థిరులై యుందుము దేవుడు మనల్ని నడిపించును గాక! 

- బ్రదర్. పి. జాకబ్ శంకర్ గారు 

 

ప్రార్ధన అంశం:-

మన ఆఫీసులో పనిచేస్తున్న మిషనరీల గురించి ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş holiganbet güncel holiganbet giriş holiganbet sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking casibom giriş perabet padişahbet padişahbet giriş holiganbet cashwin tambet grandpashabet bahiscasino amgbahis betbey amgbahis radissonbet betpuan cashwin matbet perabet perabet giriş instagram ban service pashagaming pashagaming giris gorabet gorabet giris grandpashabet çarkbet çarkbet giriş deneme bonusu casibom giriş casibom vaycasino vaycasino giriş casibom meritking casibom casibom giriş meritking meritking giriş holiganbet