Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.04.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 03-Apr-2024

దిన ధ్యానము(Telugu) 03.04.2024

 

అంశం: మనం ఎవరము? 

 

"నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొనియుండుడి" - యూదా 1:21 

 

 దేవుడు మనకు అనుగ్రహించిన బైబిల్లో తప్పిపోయిన కుమారుడి యొక్క ఉపమానము చాలా ప్రసిద్ధిగాంచినది. దాని ద్వారా పరిశుద్ధాత్ముడు అనేక మందితో అనేక విధములుగా మాట్లాడి వాళ్ళ జీవితములను మార్చి ఉన్నాడు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుటకు మన హృదయాన్ని సిద్ధపరచుకుందామా? 

 

ఒక తండ్రికి ఇద్దరు కుమారులు గలరు. చిన్న కుమారుడు తండ్రి వద్దకు వచ్చి ఆస్తిలో నా భాగం ఇమ్ము అని అడిగాడు. పెద్ద కుమారుడు అయితే తండ్రి తో ఉండి ఆయన చెప్పిన పనులన్నీ కూడా చేస్తున్నాడు. చిన్నవాడు తను కోరుకున్న అన్నింటిని పొందుకున్న మరుక్షణమే తండ్రిని విడిచి దూర దేశమునకు వెళ్ళిపోయాడు. ఆయనకు తండ్రి మీద ఎలాంటి ప్రేమ ఉన్నట్లు కనబడలేదు కానీ తండ్రి వద్దనుండి దేనిని పొందుకోవచ్చు అనే స్వార్థం మాత్రమే ఉండేది. ఈ దినము మనలో అనేక మంది ఇలానే ఉంటున్నారు. దేవుని వద్ద నుండి దేనిని పొందుకోగలను అని స్వార్థపూరితమైన దీవెనల కొరకు మాత్రమే సంఘాలకు, దేవుని ఆలయానికి వెళుతూ ఉన్నారు. 

 

పెద్దవాడు చిన్నవాడి కంటే మంచివాడు అని మనము ఆలోచించవచ్చు కానీ వాడి యొక్క మనస్తత్వాన్ని పరిశీలించి చూచినయెడలా వాడు కూడా పొరపాటు చేస్తున్న వాడు గానే ఉన్నాడు. మారుమనస్సు పొంది వచ్చిన తన సహోదరుని కొరకు తండ్రి సిద్ధపరిచిన విందులో పాల్గొ లేకుండునట్లు తనలో అసూయతో నింపబడ్డాడు. చెడిపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్న తన తమ్ముడికి జరుగుతున్న ఘనతను చూచి కఠినస్తుడుగా మారిపోయాడు. తండ్రి వద్ద ఇన్ని సంవత్సరములగా నేను మీకు లోబడిన నాకు ఇలా చేశారా అని అడుగుతున్నాడు. ఈ దినము మనలో అనేకులకు ఇలాంటి మనస్తత్వం కలదు. అర్హత లేని వాళ్ళు మేలుపొందినప్పుడు వాళ్లు మీద అసూయ చెందుతున్నాం. ఇతరులతో పోల్చుకొని వాళ్ల అర్హతకు మించి దీవించబడుతున్నారు అర్హత కలిగిన నేను ఎలాంటి ఆదాయం పొందుకొనలేదు అని మనసులో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. మనము కూడా ఇలానే ఉంటున్నామా? 

 

ప్రియమైన వారలారా! మనము ఈ ఇద్దరి యొక్క మనస్తత్వాన్ని విడిచిపెట్టి తండ్రి యొక్క హృదయం వలె జీవించడానికి ప్రయత్నిద్దాం. తండ్రి తన ఇద్దరి కుమారులను క్షమించి వారి వద్ద నుండి ఎలాంటిది ఆశించకుండా వాళ్ళని ప్రేమించిన తండ్రి యొక్క ప్రేమే విశేషమైనది, శ్రేష్టమైనది. మనసు మారి వచ్చిన చిన్న కుమారుడిని ఎదురుకొనుటకు పరిగెత్తుకొని వెళ్లి కౌగిలించుకున్నారు, కోపముతో బయటకు వెళ్లిన పెద్దవాడిని వెతుకుతూ వెళ్లి ఆయన కూడా ప్రేమతో లోపలకి పిలుస్తూ ఉన్నారు. అబ్బా ఎంత ప్రేమ ఈ దినము కుటుంబాలలో పరిచర్యలో పెద్ద కుమారుడు యొక్క మనసుతో చిన్న కుమారు యొక్క మనస్తత్వంతోను కనబడుతున్న రెండు గుంపులు కలరు. వీళ్లను తండ్రి మనసుతో ప్రేమించి ఏసుక్రీస్తుని ప్రతిబింబించే వారముగా మన జీవిద్దాం. 

- శ్రీమతి. జబా గణేషన్ గారు 

 

ప్రార్థన అంశం:-

చిన్న పిల్లల క్యాంపును నడిపించుటకు ప్రణాళిక వేసి జరిగిస్తన్నటువంటి క్యాంపుల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet jojobet giriş matbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom meritking perabet casibom holiganbet galabet casibom padişahbet padişahbet giriş grandpashabet jojobet cashwin grandpashabet radissonbet palacebet amgbahis cratosroyalbet grandpashabet betpuan betsalvador matbet meritking perabet perabet giriş instagram ban service betsilin betsilin giris pashagaming pashagaming giris gorabet gorabet giris kralbet holiganbet