Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.04.2024
Share:

By Village Missionary Movement

Monday, 08-Apr-2024

దిన ధ్యానము(Telugu) 08.04.2024

 

అంశం: యేసయ్య యొక్క జవాబు 

 

"నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణచేయగా యెహోవా-తరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసికొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను" - 1 సమూయేలు 30:8

 

ఒకసారి సువార్తికుడైన బిల్లీ గ్రహం ఆయన ప్రసంగించుటకు లండన్ లో ఒక సువార్త కూడిక ఒకటి సిద్ధం చేయబడి ఉంది. ఆయన ఆ కూడిక నడిపించడానికి రాకూడదు అని చాలా వ్యతిరేకతలు లేచాయి. ఆయన గురించి అనేక వార్తాపత్రికలలో చెడ్డగా రాయడం మొదలుపెట్టాయి. ఈ పరిస్థితిలో ఆయన మరియు ఆయన భార్య షిప్ లో లండన్ కు వచ్చి దిగిన వెంటనే విలేకరులు అతని చుట్టూ ముట్టి మా లండన్ ను మార్చడానికి వస్తున్నారా? మీ అమెరికాను మార్చేసారా అని అందరూ నోటికి వచ్చినట్లు అనేక ప్రశ్నలు అడిగారు. సువార్త ప్రకటించుటకు ఒక క్రైస్తవ దేశానికి వచ్చిన ఈ దేశం ఇలా ఉన్నది అని ఆలోచించి బిల్లీ గ్రహం హృదయం చాలా దుఃఖంతో నిండిపోయింది. అక్కడి నుండి తాము వెళ్ళవలసిన పట్టణమునకు రైలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఈ కార్యాలు ఇలా ఉన్నాయే నేను ఎలా వెళ్లి పరిచర్య చేయగలను అని హృదయం నొచ్చుకున్న వాడిగా దేవుని వైపు చూసి ప్రార్థన చేశారు. ప్రేమ సమస్తాన్ని ఓర్చుకుంటుంది సమస్తాన్ని సహిస్తుంది అని బైబిల్ వాక్యం ద్వారా దేవుడు అతనితో మాట్లాడారు. వెంటనే ఆయనకు ఉండిన భారం అంతా మంచు వలె కరిగిపోయినట్టు ఆయన హృదయము నిమ్మలంగా మారింది. రైల్లో నుండి ఆయన దిగిన వెంటనే వేలకొలది మంది ప్రజలు అక్కడ ఆయన కొరకు వేచి ఉండి చాలా ఆసక్తితో ఆహ్వానించారు. మీ కొరకు నేను ఎంతమంది ప్రజలను నేను పెట్టనో చూశావా అనే స్వరముతో దేవుడు అతని హృదయంలో మాట్లాడారు. దానిని విన్న బిల్లీ గ్రహం కళ్ళల్లో నుండి కన్నీరు కారింది. 

 

బైబిల్లో అపోస్తులుడైన పౌలు పరిచర్య మార్గంలో అయితే సరే, శిష్యులు యొక్క పరిచర్యలో కావచ్చు, వాళ్ళు అనేక సమస్యలు, శ్రమలు, ఇరుకుల మధ్యలో దేవుని పరిచర్య నెరవేర్చి ముగించారు. యేసయ్య యొక్క శిష్యులు అనేక సార్లు ఒంటరిగా వెళ్లి భాష వేరే విధమైన ప్రజలు, పారంపర్య ఆచారాలు అన్నింటిని భిన్నంగా ఉన్నప్పటికీ ఆత్మల పట్ల ఉన్న ప్రేమ వలన సమస్తాన్ని సహించి పరిచర్య చేసి యోహాను తప్ప మిగిలిన అందరూ హతసాక్షులుగా మరణించారు. మీరును క్రీస్తును అంగీకరించినందున ఆయనను ఇతరులకు ప్రకటించడం వలన మీ కుటుంబీకులు చేత లేదా ఇతరులు చేత నిందను అవమానమును పొందుతూ వస్తున్నారా? కలవరపడకుడి క్రీస్తు మీద గల ప్రేమ సమస్తాన్ని ఒర్చుకొనుటకు బలమనిస్తుంది ఎందుకంటే ప్రేమ సమస్తాన్ని ఓర్చుకుంటుంది, సమస్తాన్ని సహిస్తుంది. అప్పుడు దేవుని ప్రేమ మన హృదయంలో ఔషధము వలె మన గాయములను కడుతుంది. ఎవరు మీ మీద ద్వేషముతో ఉన్నారో వాళ్లే మీ వద్దకు వచ్చేటట్లు దేవుడు వాళ్ళని మారుస్తారు. దేవుడు మీ కొరకు పెట్టుకొని ఉన్న ఆత్మలను మీ ద్వారా దీవించేటట్లు చేస్తారు. 

- బ్రదర్. పరమశివన్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన సేవకుల యొక్క ప్రయాణ సంరక్షణ కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet grandpashabet holiganbet giriş sahabet onwin bets10 bets10 giriş bets10 güncel giriş betcio atlasbet casibom Royalbet Royalbet giriş Royalbet güncel Royalbet meritking meritking giriş perabet perabet giriş casibom casibom giriş holiganbet holiganbet giriş galabet casibom casibom giriş grandpashabet perabet perabet giriş padişahbet padişahbet giriş meritking meritking giriş grandpashabet grandpashabet giriş kalitebet kalitebet giris betsmove betsmove giris gonebet gonebet giris betnano betnano giriş jojobet jojobet jojobet jojobet jojobet holiganbet holiganbet holiganbet grandpashabet grandpashabet