Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.04.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 16-Apr-2024

దిన ధ్యానము(Telugu) 16.04.2024

 

అంశం: నీళ్లు తోడుము

 

"ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును" - సామెతలు 11:25

 

తోడుతున్న భావే నీళ్లు ఇస్తుంది అని మనందరికీ తెలుసు. నీళ్లు మాత్రం కాదు మన జ్ఞానము కూడా అంతే. జోనస్ చాక్ అనే వ్యక్తి న్యూయార్క్ యూనివర్సిటీలో వైద్యము చదివారు. వైరస్ గురించి పరిశీలన చేయుటకు ఒక పరిశోధన కేంద్రంలో పనిచేశారు. ఈయనకు పోలియో జ్వరమునకు సరియైన మందు కనిపెట్టాలి అనే పని ఇవ్వబడింది. తన యొక్క కఠినమైన ప్రయాస వలన తాను తన స్నేహితులతో కలిసి పోలియో పతనము చేసే వైరస్ ని కనిపెట్టారు. ఆ మందు 1955వ సంవత్సరంలో అమెరికాలో వాడబడింది. అందువలన పోలియో రోగము కట్టడిలోనికి వచ్చింది అని మనము దానిని ఎరుగుదము. ఈ మందుని తనంతట తానే వాడుకుని ఉంటే ఆ మందు ఎవరికి ఉపయోగపడి ఉండేది కాదు. ఆ మందు అందరికీ ఇవ్వబడింది అందువల్ల లోకము సహాయం పొందింది. 

 

బైబిల్లో సౌలు అనేవాడు ఇంకను ప్రభు యొక్క శిష్యులను భయపెట్టి హత్య చేయడానికి సిద్ధపడిన ఆయనను యేసయ్య దర్శించారు. వెంటనే ఆలస్యం చేయకుండా క్రీస్తు దేవుని కుమారుడు అని సమాజ మందిరంలో ప్రసంగించారు. పొందుకున్న రక్షణను బహిరంగముగా ప్రకటించారు. మరియు దాని పొందుకున్న రక్షణ అనుభవాన్ని తనను దర్శించిన యేసయ్యను దాచి పెట్టకుండా అన్యులకు కూడా బహిరంగముగా ప్రసంగిస్తూ వచ్చారు. అయితే సౌలు చెబుతున్న మాటను అనేకులు గ్రహించగలిగారు. పరలోక వాసులుగా మారాలి అని ప్రయాసపడ్డారు. 

 

ప్రియమైన వారలారా లోకములో దొరుకుతున్న ఘనత బిరుదులు ఇవన్నీ మనకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఎందుకు అంటే అది ఇతరులకు మేలు కలిగిస్తుంది. అలానే పరలోక సంతోషాన్ని ఇతరులకు పంచినప్పుడే మనకు సంతృప్తి కలుగుతుంది. ఇతరులు పరలోకానికి అర్హులుగా మారుతారు కాబట్టి ఆత్మల సంపాదన చేయుటకు సువార్త ప్రకటించుట చాలా ప్రాముఖ్యం. సాధారణంగా ఉచితముగా దొరికిన వస్తువులకు అనేకమైన ప్రకటనలు ఉన్నాయి కానీ యేసయ్యా అనే నామము ఆయన ఇచ్చే నిత్య జీవము అనుభవిస్తున్న ఏ ఒక్కరు కూడా ఖాళీగా ఉండకూడదు. ఇతరులు పరలోకానికి వెళ్లాలి కాబట్టి యేసయ్య గురించి ప్రకటించవలసిన బాధ్యత మనమే అవుతుంది. 

- బ్రదర్. గుణశీలన్ గారు 

 

ప్రార్థన అంశం:-

యవ్వన స్త్రీల కొరకు ప్రసారం అవుతున్న టీ.వీ కార్యక్రమాల ద్వారా అనేకులు దేవున్ని తెలుసుకొను లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet