Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.04.2024
Share:

By Village Missionary Movement

Thursday, 18-Apr-2024

దిన ధ్యానము(Telugu) 18.04.2024

 

అంశం: ఎవరు మన కొరకు వెళ్లెదరు? 

 

"అప్పుడునేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. అంతట నేనుచిత్తగించుము నేనున్నాను నన్ను పంపు మనగా" - యెషయా 6:8

 

నోవాహు, అబ్రహాము, దావీదు మరియు అనేక ప్రవక్తలు దేవుని కార్యములను ఆయన చిత్తానుసారముగా చేశారు. కొత్త నిబంధనలోనూ శిష్యులు అపోస్తులను విశ్వాసులు గొప్ప కార్యములు దేవుని కొరకు చేశారు. మిషనరీలు, విస్తారమైన సేవకులు ఈ దినం వరకు దేవుని కొరకు పనిచేసిన వారిగా ఉండినప్పటికీ దేవుడు ఇంకను ఆయన కొరకు పనిచేసే యోధులను వెతుకుతూ ఉన్నారు. 

 

ఒక భక్తుడు ఇలా పాడుతున్నాడు. దేవుడు వెతికే వ్యక్తులు మనలో ఎవరెవరు ఉన్నారు అని. దేవుని పని చేయుటకు ఆయన కార్యాన్ని చేయుటకు దేవుడు శ్రేష్టమైన వ్యక్తులను వెతుకుతూ ఉన్నారు. ఈయన మనుషులు చూసినట్లు చూడరు లోక ప్రజలు పైరూపాన్ని చూసి లెక్క కడతారు వారు వేషదారులుగా తిరుగుతున్నారు. దానికి తగిన ఫలితాన్ని ఈ లోకంలోనే వారు పొందుకుంటారు. వాళ్లకు పేరు ఆస్తులు అన్ని దొరుకుతున్నాయి కాని నిత్యములో వారి యొక్క ఆస్తి శూన్యముగానే ఉంటుంది. ఈ లోకంలో క్రీస్తు పని పైన నమ్మిక ఉంచినట్లయితే అందరికంటే పరితపించేవారుగా మనం ఉంటాం (1 కొరింది 15 :18)

 

మనం మనుషుల కొరకు పరిచర్య చేయకుండా లోక ఘనతను పక్కనపెట్టి దేవుని మహిమ కొరకు పరలోక నిధి కొరకు పనిచేసిన యెడల దేవుడు వెతుకుతున్న వ్యక్తి మనమే అవుతాం. 

 

19వ సంవత్సరంలో టిబేట్ దేశం వైపు వెళ్ళిన సాధు సుందర్ సింగ్ టిబేట్ బౌద్ధుల లామాల ద్వారా పట్టబడి హింసించబడ్డాడు. ఒక పురాతన బావిలో పడవేయబడ్డాడు అద్భుత రీతిలో దేవుని చేత విడిపించబడ్డారు. అడవిలో ఉన్న కొండల్లోనూ గల గ్రామాలకు కాలినడకలో వెళ్లి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించారు. రక్తము కార్చే పాదములు గల అపోస్తులుడు, భారతదేశ అపోస్తులుడు అని పిలవబడ్డాడు. దేవుడు వెతికి ఏర్పరచుకున్న వ్యక్తిగా సాధు సుందర్ సింగ్ ఉండేవారు. 

 

ఈ దినము మన కార్యము కొరకు ఎవరు వెళ్లెదరు అని త్రియేక దేవుడు వెతుకుతూ ఉన్నారు. పిలిచే ఆయన పిలుపునకు చెవి ఒగ్గుదాం. చివరి కాలంలో ఈ 11 వ గంట సమయంలో కూడా ఒక గంట అయినా దేవుని కార్యము కొరకు పనిచేసి పరలోక భాగ్యమునకు అందుటకు ఈ లోకంలో ప్రయాస పడదాం. 

- బ్రదర్. డి. సెల్వ రాజ్ గారు

 

ప్రార్థన అంశం:-

మనం వాడుకునే నాలుగు చక్రాల వాహనాలు మరియు ద్విచక్ర వాహనాలు రిపేర్ కాకుండా చక్కగా పనిచేసేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet