By Village Missionary Movement
Friday, 19-Apr-2024దిన ధ్యానము(Telugu) 19.04.2024
అంశం: ఆ సమయంలో
"అయితే ఇంకను ఆయన నీకు నోటినిండ నవ్వు కలుగ జేయును. ప్రహర్షముతో నీ పెదవులను నింపును" - యోబు 8:22
రాజు ఇంటర్ చదివి పై చదువు చదవలేక తాపీ పనికి వెళ్తూ ఉండేవాడు. ఎలాగో కష్టపడి చదివి పోలీస్ ఎగ్జామ్ కొరకు రాసి అందులో అర్హత సాధించాడు. ఇంటర్వ్యూకి వెళ్లబోతున్నాడు రేపు హైదరాబాదు ఇంటర్వ్యూకు వెళ్ళాలి వెళ్ళుటకు డబ్బు లేదు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ప్రార్థించి భారతదేశము దక్షిణ చివరి భాగం ఉన్న ఆయన గ్రామంలో ఉండిపోయాడు. ఆయన అన్నయ్య వదిన వచ్చి ఏరోప్లేన్ టికెట్ తీసి ఇంటర్వ్యూ జరిగిన ప్రదేశానికి తీసుకుని వెళ్లి జాయిన్ చేశారు. అక్కడ ఆయనకు మరియొక కార్యము ఆశ్చర్యం అనిపించింది. ఇంటర్వ్యూకి వచ్చిన అధికారులందరూ కూడా హిందీలో ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. రాజుకి అయితే కలత ఆయనకు హిందీ రాదు. ఆయన సమయం వచ్చింది వెంటనే ప్రశ్నలు అడుగుతున్న అధికారికి టెలిఫోన్ కాలు ఒకటి వచ్చింది. వెంటనే ఆయన వెళ్లి మాట్లాడారు. ఆ సమయంలో తమిళ్ భాష వచ్చిన అధికారి ఈయనకు ప్రశ్నలు అడిగారు వెంటనే అక్కడ సెలెక్ట్ అయి పని దొరికింది. ఈ దినం వరకు పనిచేస్తున్నాడు.
ఇలానే బైబిల్ గ్రంధంలో ఎస్తేరు గ్రంధంలో ఎస్తేరు యొక్క సంఘటన మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మొర్దెకై మీద ద్వేషం వలన హామాను తయారుచేసిన 50 అడుగులు ఎత్తైన ఊరి కంభముపై ఆయనను ఆయనతోపాటున జనాంగమును చంపుటకు రాజు యొక్క అనుమతి తీసుకున్నారు. మొర్దెకైనీ ఉరివేయాలి అని రాజు సన్నిధిలో అడుగుటకు వచ్చి నిలబడ్డాడు. రాజు హమానుని లోపలికి పిలిచి రాజు మొదటిగా మాట్లాడం ప్రారంభించారు. రాజునూ ఘనపరచాలి అనే వాడికి ఏమి చేయాలి అని అడిగారు ఒకవేళ హమాను మొదటిగా మాట్లాడి ఉంటే మొర్దెకైనీ ఉరి వేయాలి యూదా జనాంగమును నాశనం చేయాలి అని అడిగి ఉండేవాడు కానీ ఒక్క క్షణము దేవుడు ఆ కార్యాలు మార్చి వేశాడు.
అవును ప్రియమైన వారలారా! దీన్ని చదువుతున్న మీ యొక్క జీవితంలో పరిస్థితులు ఎంతో వ్యతిరేకంగా ఉండవచ్చు నిరుత్సాహము పడిపోకండి. ఏమిటి ఈ పరిస్థితి అని కలత చెందకండి. మన దేవుడు ఒక్క క్షణంలో కార్యములను మార్చి సంతోషముతో ఆనందముతో మిమ్మును నింపగలరు. ఒక్క క్షణము చాలు దేవుడు కార్యం చేయుటకు. మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి. కనుక ప్రార్థించండి, వేచి ఉండండి మీ జీవితాన్ని దేవుడు ఉన్నతంగా మారుస్తారు.
- సహోదరి. మంజుల గారు
ప్రార్థన అంశం:
ఆఫీస్ లో పనిచేస్తున్న వారి కుటుంబాల కొరకు ప్రార్థిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250