By Village Missionary Movement
Saturday, 20-Apr-2024దిన ధ్యానము(Telugu) 20.04.2024
అంశం: చచ్చిన ఈగ
"బుక్కా వాని తైలములో చచ్చిన యీగలు పడుట చేత అది చెడువాసన కొట్టును; కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినయెడల జ్ఞానమును ఘనతను తేల గొట్టును" - ప్రసంగి 10:1
ఇంట్లో గల తోటలో చెట్టు ఒకటి ఉంది. కాకి ఒకటి దాని పైన గూడు కట్టుకుంది. అదే తోటలో జీవిస్తున్న కుక్క కూడా కాకితో స్నేహం చేసింది. ఒక దినము దుఃఖముతో ఉన్న కాకిని చూచి కుక్క ఎందుకు నీవు దుఃఖముగా ఉన్నావు అని అడిగింది. అందుకు కాకి అదేమీ లేదు నేను బానే ఉన్నాను అన్నది. అందుకు కుక్క విడిచిపెట్టకుండా మరలా మరలా అడిగింది. అందుకు ఆ కాకి పిచ్చికను, పావురమును ఈ ఇంటి వారు ప్రేమగా పెంచుకుంటున్నారు కానీ నేను వాళ్ళ కిటికీ యొద్దకు వెళ్ళినప్పుడు నన్ను వారు తరిమి వేశారు నేను ఎందుకు వీరికి నచ్చలేదు, నాలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో తెలుసా అని అడిగింది. అందుకు కుక్క మంచి గుణాలు నీయొద్ద? ఎక్కడో చెప్పు చూద్దాం అని అడిగింది. ఉదయాన్నే లేస్తాను శుభ్రంగా ఉంటాం అందరితో కలిసి ఉంటాము అన్నది కాకి. కుక్క ఇవన్నీ మీరు చేసినప్పటికీ మీ వద్ద దొంగతనం చేసే అలవాటు ఉన్నది అది కూడా అందరూ కన్నులు తెరిచి చూస్తూ ఉండగానే చేతిలో ఉన్న దాని లాక్కొని వెళ్ళిపోతారే అని అన్నది. అవును ఎన్ని మంచి గుణముల ఉన్నప్పటికీ దొంగతనం వలన నా యొద్ద ఉన్న మంచి గుణాలు అన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి అని చెప్పి కాకి బాధపడింది.
ఇలానే జ్ఞానంలోనూ ఘనత లోను పేరు పొందినప్పటికీ కూడా హీనమైన ఇలాంటి పనులు చేసినప్పుడు చెడ్డవారు అనే ముద్ర వేయబడుతుంది. మనము చేసే తప్పిదమైన చిన్న చిన్న తలంపులు, ఆలోచనలు మాటలు మనలను అపవిత్రం చేస్తాయి. ఉజ్జియా రాజు 16 సంవత్సరాల కాలం దేవుని దృష్టిలో మేలైన కార్యాలు చేశాడు. తన బలమును తన సైన్యపు బలమును పెంచుతూ వచ్చాడు. ప్రజల యొక్క కార్యాల్లో ఆసక్తి గలవాడుగా ప్రజలను పరిపాలిస్తూ వస్తున్నాడు. అనేక కార్యాలు చేశాడని బైబిల్ చెప్తుంది కానీ తనకు కీడు కలిగేటట్లు అతని మనసు గర్వంతో నిండిపోయింది అని బైబిల్ చెప్తుంది. గర్వము అనే చచ్చిన ఈగ ఆయన సువాసన గల తైలం వంటి జీవితాన్ని వారి యొక్క సద్గుణాలను అపవిత్రం చేసింది. మోషే యొక్క చిన్న అవిధేయత కానానును సొంతం చేసుకోలేకపోయింది. సొలోమోను మన గొప్ప జ్ఞానిగా ఉన్నప్పటికీ దేవుని ఆజ్ఞలను అధిగమించి అన్యులైన స్త్రీలను వివాహం చేసుకొనుట వలన రాజ్యం రెండుగా చీల్చబడింది. ఎంత బలం ఉన్నా గాని ఇక్కడ దేవుని ఆజ్ఞను అధిగమించి సంసోను సింహము కలేబరం నుండి తేనెను తినుట వలన బానిసగా మారిపోయాడు.
ప్రియమైన వారలార మీరు చక్కగా దీవించబడి ఉన్నారా? గర్వము, అవిధేయత ఇవన్నీ మన ఆలోచనలకు రాకుండా చూసుకోవాలి. అందుకు ప్రతిరోజు మనల్ని మనమే పరిశీలించి చూసుకోవాలి. అన్నీ సమస్యలను దేవుని చేతిలో పెట్టి దేవునికి సమర్పించాలి. దేవుని కృప, దీవెనలు, దయ లేకుండా ఏమీ లేదు అని మన మనసులో మనం గుర్తుపెట్టుకోవాలి. చచ్చిన ఈగ వంటి కార్యాలను మన జీవితంలో ఉండకుండా జాగ్రత్త పడాలి.
- శ్రీమతి. అనుభూ జ్యోతి స్టాలిన్ గారు
ప్రార్థన అంశం:
మీడియాలో పనిచేస్తున్న వ్యక్తులు మరియు వారి కుటుంబముల కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250