Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.04.2024
Share:

By Village Missionary Movement

Monday, 29-Apr-2024

దిన ధ్యానము(Telugu) 29.04.2024

 

అంశం:- పునాది

 

"అయినను దేవునియొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది.ప్రభువు తనవారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునది" - 2 తిమోతికి 2:19

 

కెనడా దేశంలో పుట్టి పెరిగిన జోనాధాన్ గో ఫోర్త్ 20వ శతాబ్దంలో చైనా దేశంలో గొప్ప ఉజ్జీవం రావడానికి ప్రాముఖ్యమైన వ్యక్తి. ఈయన తన ఐదవ ఎటలోనే బైబిల్ వాక్యమును కంటస్టాప్ పెట్టి ఇతరులకు చెప్పాలి అంటే ఇతనికి చాలా ఆసక్తి మరియు చిన్న ప్రాయంలోనే దేవున్ని ఎక్కువగా వెతికేవారు. సమర్పించబడిన క్రైస్తవుడిగా జీవించి వచ్చారు. ఆత్మల పట్ల భారము ఆయనకు అత్యధికముగా ఉండేది. హట్ సన్ టైలర్ రాసిన పుస్తకం ద్వారా చైనా దేశంలో మిషనరీగా వెళ్ళుటకు సమర్పించుకొని భార్య మరియు పిల్లలతో చైనా దేశం మిషనరీగా వెళ్లారు. బైబిల్ వాక్యము మరియు ప్రార్థన మాత్రమే ఇతనికి చేతి కర్రగా ఉండేవి. చైనాలో గల భిన్నమైన వాతావరణం వలన ఆయన మరియు ఆయన కుటుంబం చాలా బలహీనులు అయ్యారు. విరోచనములు చేత తన మొదటి కుమారుడ్ని కోల్పోయారు. ఒకరి తర్వాత ఒకరు అని ఐదుగురు బిడ్డలను కోల్పోయి భార్యాభర్తలు ఇరువురు నిస్సహాయ స్థితిలో నిలబడ్డారు. అయినప్పటికీ వీళ్ళ పరిచర్యను, దేవున్ని విడిచిపెట్టి ఎంత మాత్రం వెనక్కి వెళ్ళకుండా దృఢముగా యేసయ్య కొరకు పరిచర్య చేసి తన పరుగుని ముగించారు గోఫోర్త్. పరిచర్య వలన అనేకమంది రక్షించబడ్డారు. అందరూ అన్నింటిని కోల్పోయిన పరిస్థితుల్లో వీరి యొక్క పునాది క్రీస్తు పైన ఉండేది. 

 

దావీదు అతని యొక్క మనుషులు యుద్ధమునకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో సిగ్లాక్ పట్టణము అగ్ని చేత కాల్చబడిఉన్నది అనియు తన కుమార్తెలు, కుమారులు చెర కొనిపోబడ్డారు అని చూశారు. దావీదు అత్యధికమైన ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. ప్రజలందరూ కూడా తమ కుమారులు కుమార్తెలు నిమిత్తము దుఃఖముతో దావీదు పైన రాళ్లతో కొట్టి చంపాలి అని ఆలోచించారు. అటువంటి సందర్భంలో దావీదు తన దేవునియందు తనను బలపరుచుకున్నాడు. 

 

ప్రియమైన వారలారా! దావీదు యొక్క పునాది దేవుని పైన ఉన్నందున కోల్పోయిన సమస్తమును మరల సొంతం చేసుకోగలిగాడు. ఈ దినం మన భారం దేనిపైన ఉన్నది అని ఆలోచిద్దాం. ధనము పైన లేక వస్తువుల పైన లేక మనకు ఇష్టమైన వ్యక్తులు పైన? క్రీస్తు యొక్క పునాది పైన మన జీవితం కట్టబడిన యెడల మన జీవితం ప్రయోజనకరముగా ముందుకు వెళుతుంది. ఆ విధముగా మన జీవితమును దేవునికి సమర్పించుకుందాం. పౌలు వలె అనేక సమస్యలు మనల్ని అధికమించడానికి వచ్చిన అది మనల్ని ఏమీ చేయలేదు. దేవుని కొరకు ఏదైనా చేసే వారముగా మన మారదాం. మన పునాది దృఢంగా ఉండిన యెడల ఎంత పెద్ద భవనములైనా మన నిర్మించగలం. 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజు గారు

 

ప్రార్థన అంశం:-

ప్రతి రాష్ట్రంలో దేవుని చేత ఏర్పరచబడిన 500 మంది మిషనరీలు లేపబడినట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler meritking meritking giriş meritking güncel giriş alobet alobet giriş nakitbahis Betpark milanbahis nakitbahis online casino online casino perabet perabet giriş perabet perabet giriş bahsegel jojobet perabet perabet giriş perabet güncel giriş jojobet jojobet giriş jojobet güncel giriş Holiganbet Holiganbet Giriş Holiganbet Güncel Giriş Superbetin Superbetin Giriş Superbetin Güncel Giriş pashagaming pashagaming giriş pashagaming güncel giriş betcio Betcio Giriş betcio güncel giriş atlasbet atlasbet giriş atlasbet güncel giriş Piabet Piabet Giriş Ngsbahis Ngsbahis Giriş İnterbahis İnterbahis Giriş Klasbahis Klasbahis Giriş Coinbar Coinbar Giriş Limanbet Limanbet Giriş İmajbet İmajbet Giriş Restbet Restbet Giriş Matbet Matbet Giriş Jasminbet Jasminbet Giriş Belugabahis Belugabahis Giriş