Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.05.2024
Share:

By Village Missionary Movement

Monday, 06-May-2024

దిన ధ్యానము(Telugu) 06.05.2024

 

అంశం:- సువార్త పత్రిక 

 

"కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు" - మత్తయి 28:19

 

ఒక సువార్త పత్రిక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకువచ్చింది. అది మాత్రమే కాదు 9 మంది మిషనరీలను ప్రపంచమునకు ఇచ్చుటకు కారణమైంది. తమిళనాడులో శ్రేష్టమైన వైద్య సేవలు ద్వారా శరీరానుసారమైన సుఖం మాత్రమే కాదు ఆత్మనుసారమైన స్వస్థతను కూడా పొందుటకు సహాయపడింది. అది ఏమిటి? ఆ కరపత్రికను ఎవరు ద చదివారు? అందులో ఉన్న తమిళనాడు యొక్క వైద్య సేవల? 

 

అవును ఒక దినము జాన్ స్కడ్డర్ అనే వ్యక్తి తన స్నేహితుడిని చూచుటకు ఒక ఇంట్లో వేచి ఉన్నాడు. అప్పుడే ఆయన కంట్లో పడింది ఆ కరపత్రిక. దాని యొక్క అంశము ప్రపంచం యొక్క మారుమనస్సు. చూచిన వెంటనే దాని చేతిలోకి తీసుకుని చదవడం ప్రారంభించాడు. తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకున్నాడు. తర్వాత దినాల్లో తనను పరిచర్యకు సమర్పించుకున్నాడు. ఆయన తన ఏడుగురు కుమారులను ఇద్దరు కుమార్తెలను మిషనరీ పరిచర్యకు సమర్పించుకున్నాడు. ఆయన కుటుంబీకులలో 43 మంది క్రైస్తవ పరిచర్య కొరకు సమర్పించబడిన వారే. జాన్ స్కడ్డర్ మనవరాలే మన వెల్లూరులో గల సి.ఎం.సి హాస్పిటల్ రావడానికి వైద్య సేవలతో సువార్త పరిచర్య చేసిన హైడ స్కడ్డర్ తల్లి గారు. తరతరాలుగా ఒక కుటుంబము క్రీస్తు పరిచర్య చేసి వచ్చిన యెడల అది చరిత్రలో గొప్ప ఉదాహరణ కదా! 

 

ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమతో చెప్పిన చివరి ఆజ్ఞ మీరు బయలుదేరి వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్నదే. యేసుక్రీస్తు ప్రభువు తాను చేయని ఒక కార్యాన్ని మన దగ్గర ఎదురు చూడలేదు. ఆయన కూడా సువార్తను ప్రకటించి రోగులను స్వస్థపరచిన వారిగా జీవించి చేసి చూపించారు. 

 

 ప్రియమైన వారలారా సువార్త ప్రకటించుట అన్నది సంపూర్ణ సేవకులకు మాత్రము కాదు ప్రతి ఒక్క విశ్వాసికి సువార్త ప్రకటించే బాధ్యత గలదు. ఒక కరపత్రిక ఒకరిని మార్చడం ద్వారా వేలకొలది ప్రజలు రక్షణ పొందడానికి రక్షణ మార్గమునకు దారితీసింది. మనము ఇచ్చే ఒక సువార్త కరపత్రిక ఎవరో ఒకరికి రక్షణ పొందుకొనుటకు కారణం అవుతుంది కాబట్టి మనము చేస్తున్న కరపత్రిక పరిచర్యలను గొప్పగా చేద్దాం. ఇచ్చుటకు ఇవ్వవలసిన వ్యక్తికి ప్రార్థనతో ఇద్దాం. దేవుడు కచ్చితంగా పనిచేస్తాడు. దేవుడు కరపత్రిక తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ పరలోక వ్యక్తులుగా దేవుడు మారుస్తారు. 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజు గారు 

 

ప్రార్థన అంశం:-

అండమాన్ నికోబార్ లో ప్రారంభించబడి ఉన్న మన పరిచర్య గురించి ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet