Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.05.2024
Share:

By Village Missionary Movement

Saturday, 18-May-2024

దిన ధ్యానము(Telugu) 18.05.2024

 

అంశం:- అవసరములు తీరును 

 

"కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును" - ఫిలిప్పీయులకు 4:19 

 

గొప్ప ప్రసంగీకుడు చార్లెస్ స్పర్జన్. ఈయన తన తాతయ్య గారు జీవితంలో జరిగిన అనేక అద్భుత కార్యములను తన ప్రసంగములో చెబుతూ ఉంటారు. ఈయన తాతయ్య గారి పేరు కూడా స్పర్జన్. సేవకుడైన ఆయనకు పదిమంది పిల్లలు. పరిచర్యలో వచ్చే చిన్నపాటి సహాయముతో ఆ కుటుంబాన్ని నడిపించ డానికి సరిపోయేది కాదు. కాబట్టి పేదరికంలో జీవిస్తూ వచ్చారు. పిల్లలు యొక్క ఆకలి తీర్చుటకు ఒక ఆవు మాత్రం ఉండేది హఠాత్తుగా ఒకరోజు ఆవు కూడా మరణించింది. పిల్లలకు పాలు ఇవ్వలేకపోతున్నానే అనే చింతతో స్పర్జన్ భార్య ఏమి చేయాలి అని అంగుళారుస్తూ ఉన్నారు. 

 

స్పర్జన్ కు ఏమి చేయాలో తోచలేదు కానీ నా దేవుడు నా పిల్లలకు పాలు ఇవ్వగలడు అని విశ్వసించారు. కాబట్టి దేవుడు సమస్తము చేయగలడు అని చెప్పి ప్రార్థన చేసి ప్రశాంతంగా ఉన్నారు. మరుసటి రోజు ఉదయం ఒక మనిషి వచ్చి ఆయనకు 20 పౌండ్లు డబ్బులు ఇచ్చి వెళ్లారు. వెంటనే స్పర్జన్ పాలిచ్చే ఆవును ఒకదానికొని తీసుకొని వచ్చారు. తర్వాత ఈ డబ్బులు ఎలా వచ్చాయో అని తెలిసింది. 

 

ఇంగ్లాండ్లో ధనవంతులు అందరూ కూడా తమ కానుకలను అనేకమంది సేవకులకు పంపించేవారు పెద్దవాడైన స్పర్జన్ కూడా వారికి గుర్తుకు వచ్చినందువలన స్పర్జన్ కూడా వారు 20 పౌండ్లు డబ్బులు పంపించారు అయితే సరియైన సమయంలో ఆ డబ్బులు వచ్చినందువలన ఆ సేవకుని యొక్క కుటుంబం అవసరతలు తీర్చబడ్డాయి. 

 

 ఫిలిప్పీలో పౌలు యొక్క పరిచర్యలో అవసరతలు తీర్చుటకు మనస్ఫూర్తిగా ధన సహాయము చేసి పంపించారు. ఇలా అనేకులు మనస్ఫూర్తిగా ఇచ్చుటవలన ఉపద్రవం లో గల సంఘము, సేవకులు పరిచర్య ఉత్సాహంగా చేశారు. యదార్ధమైన సేవకునికి సహాయం చేసేటప్పుడు దేవునికి ఇచ్చినట్లు అవుతుంది. 

 

నా ప్రియమైన వారలారా! మన జీవితంలో వస్తున్న అవసరతలు చూచి భయము, తడబడుట చేయకుండా విశ్వాసముతో దేవునితో గల బంధములో మనలను మన కుటుంబాన్ని సమర్పిద్దాం. ప్రేమ కలిగిన దేవుడు మన అవసరతలు తగిన విధముగా మన అవసరాలు అన్నీ కూడా నెరవేర్చి మనలను దీవిస్తారు. సింహపు పిల్లలు ఆకలిగొనినను యెహోవాను వెతుకు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమెన్! 

- శ్రీమతి. సరోజ మోహన్ దాస్ గారు 

 

ప్రార్థన అంశం:-

దేబోరా పరిచర్య చేస్తున్న మిషనరీలను ప్రతినెలా కానుకలతో సహాయము చేస్తున్న వ్యక్తులు లేచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler online casino online casino Online casino nz Best payout online casino nz meritking meritking giriş meritking güncel giriş perabet perabet giriş perabet güncel giriş holiganbet holiganbet giriş holiganbet güncel giriş Meritking Perabet Holiganbet jojobet jojobet giriş jojobet güncel giriş perabet perabet giriş perabet perabet giriş holiganbet holiganbet giriş holiganbet holiganbet giriş alobet alobet giriş bahissenin bahissenin giriş bayconticasino bayconticasino giriş atlasbet atlasbet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş marsbahis marsbahis giriş matbet matbet giriş nakitbahis nakitbahis giriş pashagaming pashagaming giriş Meritking Meritking giriş imajbet imajbet giriş İmajbet Prizmabet Yakabet Betsat Betnano Restbet Perabet Perabet Giriş Perabet Güncel Giriş Cratosroyalbet romabet nakitbahis matbet matbet çorlu escort çorlu escort