Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.05.2024
Share:

By Village Missionary Movement

Monday, 20-May-2024

దిన ధ్యానము(Telugu) 20.05.2024

 

అంశం:- తండ్రి చిత్తము

 

"వారి యొద్దనుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని" - లూకా 22:42

 

14 సంవత్సరముల మాత్రమే నిండిన ఐడా స్కాడ్డర్ యొక్క పనులు ఉద్దేశాలు అమెరికాలో జీవించుటయే. తన యొక్క తల్లిదండ్రుల వలె భారతదేశంనకు మిషనరీగా వచ్చి శ్రమలు అనుభవించుటకు కష్టములు అనుభవచుటకు ఆమె ఎన్నడు కోరుకోలేదు. ఒక సెలవు దినమునకు భారతదేశమునకు వచ్చినప్పుడు ఆమె కళ్లదుట జరిగిన ముగ్గురు యవ్వన స్త్రీల యొక్క మరణము ఆమెను చాలా ఆలోచింపజేసింది. ప్రాముఖ్యంగా స్త్రీల వైద్యులు లేనందున వారి యొక్క కాన్పులో మరణించిన ఆ స్త్రీల యొక్క మరణమే ఐడా స్కాడ్డర్ యొక్క వైద్య చదువుకు ప్రేరేపించింది. అమాయకత్వం వలన నశించిపోతున్న భారతదేశం యొక్క స్త్రీలను కాపాడుట తనను గురించి దేవుని చిత్తము అని గ్రహించుకుని వెంటనే ఆవిడ భారతదేశమునకు వైద్య మిషనరీగా పని చేయుటకు తన జీవితాన్ని సమర్పించుకున్నారు. ఈ దినము అనేకులు వెల్లూరు సీ.ఎం.సి హాస్పిటల్ వలన ప్రయోజకులవుతున్నారు. అందుగల కారణము ఐడా స్కాడ్డర్ దేవుని చిత్తాన్ని గ్రహించి నడిచినందువలన. 

 

యేసుక్రీస్తు శిలువలో వేయబడుట కంటే ముందు ప్రార్ధించిన ప్రార్థన తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోయినట్లు చేయండి అయినప్పటికీ నా చిత్తము కాదు మీ చిత్త ప్రకారమే జరగనీయుడి (లూకా సువార్త 12: 42). యేసుక్రీస్తు లోకములో నశించిపోతున్న వ్యక్తులను రక్షించుటకు తండ్రి చిత్తాన్ని చేయుటకు పరలోకాన్ని విడిచి దిగి తనను సజీవమైన బలియాగముగా సమర్పించుకున్నారు. 

 

ప్రియమైన వారలారా! తండ్రి చిత్తాన్ని సిలువలో యేసుక్రీస్తు ప్రభువు విజయవంతముగా చేసి ముగించారు. యేసుక్రీస్తు తన ఇష్టానుసారముగా నడుచుకోలేదు అన్నిటికీ తండ్రి పైన అనుకున్నారు. తండ్రి యొక్క చిత్తమును మారుగా ఏమీ చేయలేదు. యేసుప్రభు తల్లి అయిన మరియ దేవదూత మాటకు ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున జరుగును గాక అని దేవుని చిత్తమునకు ఆమె సమర్పించుకున్నది. మరి మనము కూడా మన సొంత ఆలోచనలకు చోటు ఇవ్వకుండా మనలను సృష్టించిన దేవుని చిత్తాన్ని ఎరిగి పనిచేయుటకు ప్రయత్నిద్దాం. దేవుని చిత్తానికి తనను సమర్పించే వారు మాత్రమే తమ దేవుని యొక్క గొప్ప రక్షణ ప్రణాళికను వాడుకుంటారు. ఈ దినము దేవుని చిత్తాన్ని గ్రహించి పనిచేద్దామా? 

- శ్రీమతి. రూబీ అరుణ్ గారు 

 

ప్రార్థన అంశం:-

ఈ దినం జరుగుతున్న మన మిషనరీలైన గుణశీలన్ మరియు రూతు వాళ్ళ యొక్క వివాహం కొరకు దేవుడు వారి దాంపత్య జీవితాన్ని దీవించు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet bahiscasino betsat betsat pashagaming pashagaming betpas betpas giriş ngsbahis perabet perabet giriş