Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.06.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 25-Jun-2024

దిన ధ్యానము(Telugu) 25.06.2024

 

అంశం:- ఆయన మార్గములు ఆశ్చర్యకరమైనవి 

 

"ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది" - 1 కోరింథీయులకు 2:9

 

అనేకమంది భక్తులు తమ యొక్క జీవిత దినాలలో కఠినమైన సమయాలలో దేవుడు చేయి విడిచారు అని వెలపిస్తూ ఉంటారు. యేసు ప్రభువు మనవలె శరీరముతో జీవించిన కాలంలో శ్రమల గుండా వెళ్లి సిలువలో మరణించే సమయంలో నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని విలపించారు. అపోస్తులుడైన పౌలు ఈ బలహీనతను నా యొద్ద నుండి తీసివేయండి అని అన్నారు. అందుకు ప్రభువు నా కృప నీకు చాలును అని అన్నారు. మనము కూడా మన శరీరానుసారమైన శ్రమలు, సమస్యల సమయాలలో ఎందుకు అని ప్రశ్న అడిగి జవాబు తెలియకుండా ఎదురుచూస్తూ ఉంటాం. ఇలాగే అనేకమంది విశ్వాసులు తమ జీవితంలో ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ దేవుడు మన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన మార్గములను సిద్ధం చేసి నడిపిస్తూ ఉన్నారు అనేదానిని మన జీవిత చరిత్రలో మనము కనులారా చూడగలం. 

 

యేసుప్రభును అంగీకరించిన బ్రౌన్ అనే సైనికుడు ఓడ ప్రమాదంలో చిక్కుకొని ఒక విరిగిపోయిన ఒక చెక్క సహాయముతో ఈదుకుంటూ ఒక దీవికి చేరుకున్నాడు. ఎవ్వరూ లేని ఆ దీవిలో దొరికిన కూరగాయలు ఫలములు తిని వేటాడి దొరికిన వాటిని భుజించి తన ప్రాణాన్ని కాపాడుకుంటు వచ్చారు. దొరికిన వస్తువులతో గుడిసెను ఒకటి వేసుకొని మరణించిన వరకు ఇదే నా జీవితం అనుకొని ఆ గుడిసెలో పడవ గానీ, ఓడగాని వస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు. అనేక నెలలుగా ఏమీ కనబడలేదు. ఒక దినము వేటాడి వచ్చినప్పటికీ తాను అమర్చిన తన యొక్క గుడారము అగ్నితో కాలి బూడిద అయిపోయింది. చాలా నిరుత్సాహపడి ఆయన తన జీవితాన్ని ముగించుకోవాలి అని ఆలోచించినప్పుడు ఒక నావ తన కళ్ళు ఎదుట రావడం చూశాడు. ఆ నావ తనవైపు వచ్చాట చూసి సంతోషించారు. ఆ నావలో ఎక్కిన వెంటనే ఆ నావికుడు ఇక్కడ పొగ వచ్చుట మేము చూసాం అందుకే వచ్చాను అని అన్నాడు. అప్పుడు దేవుడే దీనిని చేశారు అని గ్రహించిన బ్రౌన్ దేవునిని మహిమ పరిచారు. ఈ దినము జవాబు లేకుండా ఎందుకు ఈ మార్గంలో వెళ్తున్నాము అని వెళుతూ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి మార్గాన్ని సిద్ధము చేసి పెట్టి ఉన్నారు. మనం అన్నిటి కొరకు ఆయనను స్తుతించేటప్పుడు కచ్చితంగా మనకు దేవుడు మేలైన కార్యములు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక! 

- శ్రీమతి. ఫాతిమా సెల్వ రాజ్ గారు 

 

ప్రార్థన అంశం:-

కరపత్రిక పరిచర్య ద్వారా కరపత్రికలు అందుకున్న ప్రతి ఒక్కరూ రక్షింపబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet matbet giriş matbet instagram unban x unban twitter unban palacebet setrabet