Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.06.2024
Share:

By Village Missionary Movement

Friday, 28-Jun-2024

దిన ధ్యానము(Telugu) 28.06.2024

 

అంశం:- బలమైన హస్తం

 

"దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి" - 1 పేతురు 5:6

 

ఒకసారి ఆల్ఫ్స్ పర్వతము చుట్టూ చూపించడానికి ఒక ధనవంతుడైన ఒకరిని ఒక మార్గదర్శి తీసుకు వెళ్ళాడు. ఆల్ఫ్స్ పర్వతము ఎక్కడానికి ఆ ధనవంతుడకి చాలా భయం వేసింది. అయినప్పటికీ ఆ మార్గదర్శి అప్పుడప్పుడు ఆయనకు భరోసా ఇచ్చి తన బలమైన హస్తము చాపుతూ క్రింద పడిపోకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాడు. కొంత దూరం ఎక్కిన తర్వాత ఆ ధనవంతుడు క్రిందకు చూశాడు అప్పుడు ఆయనకు మరణ భయం పట్టుకుంది. వెంటనే ధనవంతుడు మార్గదర్శిని చూసి ఇక నేను ముందుకు వెళ్ళలేను. ఒక్క అడుగు కూడా వేయలేను. నేను పడిపోతాను అని చెప్పాడు. అందుకు ఆ మార్గదర్శి అతని వైపు చూసి అయ్యా నాకు ఇంచుమించు 30 సంవత్సరాలగా ఈ ఆల్ఫ్స్ శిఖరం పైన వేలకొలదిమంది ప్రజలను నడిపిస్తూ తీసుకుని వెళ్లాను ఏ ఒక్కరు కూడా నా చేతి నుండి జారి పడిపోలేదు నా చేతులు చూడండి అని తన బలమైన హస్తాలు చూపించాడు. ఆ ధనవంతుడు ఆ మార్గదర్శి యొక్క బలమైన హస్తాలు చూసినప్పుడు ఆయనకు ఉన్న భయం అంతా ఎగిరిపోయింది. 

 

అబ్రహాము కానాను దేశములో పది సంవత్సరాలు నివసించినప్పుడు సారా ఐగుప్తు దేశస్థురాలు అయినా

 తన పనిమనిషి అయిన హాగరుని పిలిచి అబ్రహాముకు భార్యగా ఇచ్చింది. హాగరు గర్భవతి అయిన దినములలో శార ఆమెను కఠినంగా చూసినందున హాగరు ఆమెను విడిచి పారిపోయింది. అప్పుడు యెహోవా దూత నీవు యజమానురాలు యొద్దకు మరలా తిరిగి వెళ్ళు ఆమె చేతి కింద ఒదిగి ఉండుము అని అన్నారు. ఈ మాట తర్వాతే హాగరు వాగ్దానం పొందుకున్నది. 

 

దీన్ని చదువుతున్న ప్రియమైన వారలారా దేవుని యొక్క బలమైన హస్తము కింద ఒదిగి ఉండడం నేర్చుకుందాం. అదే మనకు దీవెనలు తీసుకొని రాగలదు. దేవుని యొక్క బలమైన హస్తము మరల జారిపోకుండా పట్టుకుని చివరి వరకు మనల్ని నడిపించే బలమైన హస్తము మనకు ఉన్నది. ఆయన యొక్క బలమైన హస్తము నుండి మిమ్మల్ని ఎవరు కూడా లాక్కోనలేరు. ఆయనే మన ప్రతి ఒక్కరిని అరచేతుల్లో పెట్టుకొని ఉన్నారు. ఆయన మనలో ఏ ఒక్కరిని కూడా మర్చిపోలేదు. 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజు గారు 

 

ప్రార్థన అంశం:

మన క్యాంపస్ లో జరుగుతున్న హాస్పిటల్ పరిచర్య కొరకు, వైద్యం కొరకు వస్తున్న అందరూ కూడా రక్షింపబడేటట్లు, దీవెనలు పొందుకున్నట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al deneme bonusu deneme bonusu veren siteler meritking meritking giriş meritking güncel giriş alobet alobet giriş nakitbahis Betpark milanbahis nakitbahis online casino online casino perabet perabet giriş perabet perabet giriş bahsegel jojobet perabet perabet giriş perabet güncel giriş jojobet jojobet giriş jojobet güncel giriş Holiganbet Holiganbet Giriş Holiganbet Güncel Giriş Superbetin Superbetin Giriş Superbetin Güncel Giriş pashagaming pashagaming giriş pashagaming güncel giriş betcio Betcio Giriş betcio güncel giriş atlasbet atlasbet giriş atlasbet güncel giriş Piabet Piabet Giriş Ngsbahis Ngsbahis Giriş İnterbahis İnterbahis Giriş Klasbahis Klasbahis Giriş Coinbar Coinbar Giriş Limanbet Limanbet Giriş İmajbet İmajbet Giriş Restbet Restbet Giriş Matbet Matbet Giriş Jasminbet Jasminbet Giriş Belugabahis Belugabahis Giriş