Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.06.2024
Share:

By Village Missionary Movement

Saturday, 29-Jun-2024

దిన ధ్యానము(Telugu) 29.06.2024

 

అంశం:- బురదలో ఒక సువాసన 

 

"మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము" - 2 కోరింథీయులకు 2:14

 

హిమాలయ పర్వతం పక్కనే గల గ్రామమునకు ఒక దేవుని దాసుడు వెళ్లారు. అక్కడికి వెళ్లి చూసినప్పుడు ఆ గ్రామం అంతా బురద బురదగా ఉంది. దుర్వాసన వస్తు ఉండేది. ఊరంతా చెత్తతో నిండిపోయి ఉండేది. ఆ దుర్వాసన భరించలేక ఆ దేవుని దాసుడు ఆ గ్రామం విడిచి వెళ్లిపోయాడు. కొన్ని వారాల తర్వాత దేవుని దాసుడు మరల గ్రామానికి వచ్చాడు. ఇప్పుడు దుర్వాసన లేదు అందుకు బదులుగా మంచి సువాసన వస్తుంది. దేవుని దాసునికి ఆశ్చర్యం అనిపించింది. ఏమిటి ఇంత మార్పు అని అడిగినప్పుడు ఆ చెత్త ఉన్న ప్రాంతం అంతా కూడా ఒక విధమైన పువ్వులు పూయడం ప్రారంభించింది. ఆ ఊరు, అ బురద అలానే ఉంది అయినప్పటికీ అక్కడ పూసినటువంటి పూలు వలన దుర్వాసన లేదు. ఈ పరిమళించే పువ్వులు ఆ దుర్వాసనను కప్పివేశాయి. ఈ సువాసన కలిగినటువంటి ఆ యొక్క పూలను చూసిన దేవుని దాసుడు చెప్పినది ఏమిటి అంటే ఈ చెత్తల మధ్యలో దేవుని మహిమను చూడగలుగుతున్నాను అని అన్నారు. 

 

ఇలాగే బురద వంటి పాపములతో నిండి ఉన్న దేశం నుండి వచ్చిన స్త్రీ రూతు. రూతు , ముండ్లు మధ్యలో ఉన్నటువంటి గులాబీ వంటిది. బురదలో ఉన్నటువంటి కమలం వంటిది. ఎందుకో తెలుసా? రూతు తన భర్త మరణించిన పరిస్థితిలో ఉంది. ఎక్కడ చూసినా చీకటియే ఆమె జీవితంలో ఉండేది. రూతు ఆమె అత్తయ్య ఈ పరిస్థితిలోనే బెత్లెహేములోకి వస్తున్నారు. వాళ్లు ఇశ్రాయేలు దేవునిని నిరీక్షణతో పట్టుకోని సాతాను ద్వారా వచ్చిన ఎలాంటి శోధనను చూసి ఆమె ఆగిపోలేదు కానీ ఆమె యొక్క ధైర్యాన్ని చూసి పరలోకం ఆనందించింది. దేవదూతలు సంతోషిస్తున్నారు. కెరుబులు వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. పరిశుద్ధులు ఆనందిస్తూ ఉన్నారు. కావున రూతు యొక్క పట్టుదల పరలోకాన్ని సంతోషింపజేసింది. అందువల్లనే బెత్లెహేము నుండి రూతుకు మరల జీవితం దొరికింది. ఆమె జీవితం బోయాజుతో మరల పరిమళించే సువాసనగా నిలిచింది. ఈ బోయాజు ఐశ్వర్యవంతుడు, సద్గుణము గలవాడు, పరిశుద్ధుడు ఇలాంటి బోయాజుకు, రూతుకి వివాహము జరిగింది. ఈ రూతు బోయాజు సంతతి నుండే షారోను పొలంలో పూయబడిన పుష్పం లాంటి యేసుక్రీస్తు ప్రభువు జన్మించారు. ఈమె ప్రపంచమునకు సువాసనగా ఉన్నారు. ఈ షారోను పుష్పము సువాసనను మోయాబు స్త్రీ అయిన రూతు అంగీకరించింది. ఆమె జీవితం షారోను పుష్పం అయిన యేసు దయవలన ఆమె యొక్క జీవితం పరిమళించింది. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మీరు కూడా పాపపు జీవితంలో బందీలుగా ఉంటున్నారా ? అయితే రూతు వలె మీరు ఈ దేవునిగా పట్టుకుని ఆయన యొద్ద మీ జీవితము మారుతుంది. పరిమళించడం జరుగుతుంది. 

- సిస్టర్. సలోమి గారు 

 

ప్రార్థన అంశం:-

మన పార్ట్నర్షిప్ మిషనరీలు పరిచర్యలో బలమైన కార్యాలు జరిగేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al Elexbet instagram unban service tiktok unban instagram unban x unban twitter unban palacebet